: పుణెలో ఆకర్షణీయ నగరాల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ప్రధాని మోదీ
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న ఆకర్షణీయ నగరాలకు పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఈ రోజు నిర్వహించారు. మహారాష్ట్రలోని పుణెలో ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రధాని నరేంద్రమోదీ పుణెలో స్మార్ట్ సిటీ పనులను ప్రారంభించారు. పుణెలో 14 ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు. కార్యక్రమానికి కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, జవదేకర్, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు, ముఖ్యమంత్రి ఫడణవిస్ హాజరయ్యారు. స్మార్ట్ సిటీలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఒడిశా, రాజస్థాన్ ముఖ్యమంత్రులు కూడా మాట్లాడనున్నారు.