: బ్రెగ్జిట్ ప్రభావం టెగ్జిట్ కు దారితీయనుందా?
బ్రెగ్జిట్ కు అనుకూల తీర్పు నేపథ్యంలో మరిన్ని వేర్పాటు వాదాలు తలెత్తనున్నాయి. యూఎస్ఏ నుంచి టెక్సాస్ రాష్ట్రం విడిపోయే అంశం ‘టెగ్జిట్’ తెరపైకి వస్తోంది. బ్రెగ్జిట్ అనుకూల వర్గాలు ఉపయోగించిన ప్రచార సూత్రాలనే తామూ అనుసరించాలని టెగ్జిట్ అనుకూల వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో టెక్సాస్ నేషనలిస్టు ఉద్యమనేత డేనియల్ మిల్లర్ మాట్లాడుతూ, అమెరికాలో కలిసి ఉండాలా? వద్దా? అనే విషయమై టెక్సాస్ ప్రజల అభిప్రాయ సేకరణ జరగాలని అభిప్రాయపడ్డారు. కాగా, మెక్సికో నుంచి స్వాతంత్ర్యం పొందిన టెక్సాస్ 1836వ సంవత్సరం నుంచి 1845 వరకు స్వతంత్ర దేశంగా ఉండేది. 1845లో యూఎస్ లో 28వ రాష్ట్రంగా టెక్సాస్ చేరింది.