: కేంద్రం చేతులెత్తేసింది: మోడీ
పాకిస్తాన్ లో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న భారతీయ ఖైదీ సరబ్ జిత్ వ్యవహారంపై స్పందిస్తూ.. పటిష్టమైన విదేశాంగ విధానం అనుసరించడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. అన్ని విధాలా కేంద్రం చేతులెత్తేసినట్టే ఉందని మోడీ అభిప్రాయపడ్డారు. సరబ్ జిత్ సమస్యతో పాటు ఇటలీ మెరైన్ల కేసు, చైనా చొరబాటు ఇవన్నీ కూడా ప్రభుత్వం చాతగానితనానికి నిదర్శనాలే అని దుయ్యబట్టారు. కేంద్రానికి దౌత్యపరమైన విజ్ఞత లోపించడంతో పాటు, దృఢ సంకల్పం కొరవడిందని మోడీ అభిప్రాయపడ్డారు.