: తెలుగు రాష్ట్రాల‌కు వ‌ర్ష‌సూచ‌న‌


తెలుగు రాష్ట్రాల్లో వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నం కొన‌సాగుతోంద‌ని, 5.8 కి.మీ ఎత్తు వ‌ర‌కు ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నం ఆవ‌రించి ఉంద‌ని పేర్కొన్నారు. రేప‌టికి ఇది మరింత బ‌ల‌ప‌డి అల్ప‌పీడ‌నంగా మారే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలిపారు. కోస్తా, తెలంగాణ‌లో చెదురుమదురు వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉన్న‌ట్లు చెప్పారు. ఇక, రాయ‌ల‌సీమ‌లో ఒక‌ట్రెండు చోట్ల వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉంద‌ని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ద‌క్షిణ కోస్తా తీరం వెంబ‌డి ప‌శ్చిమ దిశగా, గంట‌కు 45 నుంచి 50 కిమీ వేగంతో బ‌ల‌మైన ఈదురు గాలులు వీచే అవ‌కాశం ఉంద‌ని, మ‌త్స్యకారులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News