: చేపలు పడుతూ సచిన్ ఫోటో దిగాడు!


సరదాగా గడిపేందుకు విదేశీ పర్యటనకు వెళ్లిన దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ చేపలు పడుతూ దిగిన ఒక ఫొటోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. కొన్నిరోజుల క్రితం లండన్ వెళ్లిన చార్లీ చాప్లిన్ విగ్రహం వద్ద దిగిన ఫొటోను, ఆ తర్వాత తన క్యారీ కేచర్ వద్ద దిగిన మరో ఫొటోను సచిన్ ఇటీవల తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా, క్రికెట్ సలహా కమిటీలో సభ్యుడైన సచిన్ ఈ నెల 24న టీమిండియా ప్రధాన కోచ్ ఎంపికకు సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News