: నిర్వాసితులకు మంచి పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధం: ఎంపీ బూర నర్సయ్య


తెలంగాణ ప్ర‌భుత్వం చేప‌డుతోన్న ప్రాజెక్టుల‌పై ప్ర‌తిప‌క్షాలు అన‌వ‌స‌ర రాద్ధాంతం చేస్తున్నాయని టీఆర్ఎస్ పార్ల‌మెంట్ స‌భ్యుడు బూర న‌ర్స‌య్య గౌడ్ అన్నారు. భూ నిర్వాసితులకు ప్ర‌భుత్వం ఎలాంటి అన్యాయం చేయ‌బోద‌ని ఆయ‌న చెప్పారు. ఈరోజు హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. భూములు కోల్పోయిన వారికి మంచి పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంద‌ని అన్నారు. విపక్షాలు ప్ర‌జ‌ల్ని త‌ప్పుదోవ ప‌ట్టించ‌డం మానుకోవాల‌ని ఆయ‌న సూచించారు. మ‌ల్ల‌న్న సాగ‌ర్ ద్వారా అతి త‌క్కువ ముంపుతో అత్య‌ధికంగా ఆయ‌క‌ట్టుకి నీరందుతుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News