: రేపటి నుంచి చంద్రబాబు చైనా పర్యటన.. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం: పరకాల
ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చైనా పర్యటనకు వెళ్లనున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ తెలిపారు. చంద్రబాబు ఈరోజు సాయంత్రం విశాఖ నుంచి ఢిల్లీకి వెళతారని, అక్కడి నుంచి చైనా బయలుదేరుతారని ఆయన చెప్పారు. రేపటి నుంచి ఈనెల 30 వరకు చంద్రబాబు చైనాలో పలు ప్రాంతాల్లో పర్యటించి, పలువురు అధికారులతో చర్చిస్తారని ఆయన పేర్కొన్నారు. రేపు చైనాలో ఐదు ద్వైపాక్షిక సమావేశాలు జరగనున్నట్లు ఆయన చెప్పారు. రాష్ట్రానికి చైనాతో వాణిజ్యపరంగా బలమైన సత్సంబంధాలు ఏర్పడ్డాయని అన్నారు. హైదరాబాద్ నుంచి అమరావతికి ఉద్యోగుల తరలింపు పక్రియ ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొనసాగుతోందని ఆయన అన్నారు.