: ఏటిగడ్డ కిష్టాపూర్‌లో రేవంత్‌రెడ్డి దీక్ష ప్రారంభం.. రైతులకు న్యాయం చేయాలని డిమాండ్
తెలంగాణ ప్రభుత్వం చేపడుతోన్న మల్లన్నసాగర్ ప్రాజెక్టుతో భూములు కోల్పోయిన ప్రజలకు మద్దతుగా మెదక్ జిల్లా ఏటిగడ్డ కిష్టాపూర్‌లో టీటీడీపీ నేత రేవంత్‌రెడ్డి దీక్ష ప్రారంభించారు. భూ నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. భూములు కోల్పోయిన వారి తరఫున పోరాటానికి సిద్ధమయినట్లు ఆయన తెలిపారు. ప్రాజెక్టుతో రైతులకు అన్యాయం జరిగిందని, భూ నిర్వాసితుల పట్ల ప్రభుత్వాన్ని నిలదీస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. భూ నిర్వాసితులకు నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.