: భాగ్యనగరిలో విదేశీ మద్యం ఏరులు!... మాజీ ఎమ్మెల్సీని అరెస్ట్ చేసిన పోలీసులు


భాగ్యనగరి హైదరాబాదులో విదేశీ మధ్యం ఏరులై పారుతోంది. అదేదో రాజమార్గంలో వచ్చిన మద్యం అనుకుంటే పొరబడినట్టే. అదంతా అక్రమ మార్గాల్లో నగరంలోకి చేరిందేనట. ఉక్రెయిన్ నుంచి కొందరు అక్రమార్కులు గుట్టు చప్పుడు కాకుండా హైదరాబాదుకు విదేశీ మద్యాన్ని తరలిస్తున్నారు. చాలా కాలం నుంచి జరుగుతున్న ఈ అక్రమ వ్యాపారంపై పక్కా సమాచారం సేకరించిన ఆబ్కారీ శాఖ అధికారులు నేటి ఉదయం నారాయణగూడ, మంగళ్ హాట్ తదితర ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేశారు. ఈ దాడుల్లో భాగంగా రూ.1.71 కోట్ల విలువ చేసే విదేశీ మద్యం బాటిళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి కీలక భూమిక పోషిస్తున్నారన్న అనుమానంతో ఓ మాజీ ఎమ్మెల్సీని, ఆయనకు సహకరిస్తున్న మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ ఎవరు, ఏ పార్టీకి చెందిన వారన్న వివరాలు తెలియరాలేదు.

  • Loading...

More Telugu News