: టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన నాగం జనార్దన్ రెడ్డి
టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ తెలంగాణ నేత నాగం జనార్దన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు మహబూబ్ నగర్లో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణలోని నీటిపారుదల శాఖలో అవినీతి జరుగుతోందని అన్నారు. ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకం పేరుతో దోపిడీ చేస్తోందని ఆయన ఆరోపించారు. టీఆర్ఎస్ ద్రోహులతో నిండిపోయిన పార్టీ అని అన్నారు. పోలీసులపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ నేతలు ఏది చెబితే అది వింటూ పోలీసులు వారికి బంట్రోతులుగా మారిపోయారని ఆరోపించారు.