: ఈ సారి ‘చెస్’ ఎత్తులతో జగన్ ఆటవిడుపు!
భార్యాబిడ్డలతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లిన వైసీపీ అధినేత వైెఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ ఒత్తిడి నుంచి బాగానే సేద తీరుతున్నట్లున్నారు. మొన్న ఎడింబర్గ్ లోని సువిశాల పచ్చిక బయళ్లలో గోల్ఫ్ ఆడుతూ కెమెరాలకు చిక్కిన జగన్... తాజాగా చెస్ క్రీడలో మునిగిపోయారు. చెస్ బోర్డు ముందు కూర్చున్న జగన్... ఎత్తులు ఎలా వేయాలా? అన్న రీతిలో దీర్ఘాలోచన చేస్తున్న ఫొటో తాజాగా విడుదలైంది. ప్రస్తుతం ఆయన ఐర్లాండ్ లో ఉన్నట్లు సమాచారం. మరో మూడు రోజుల్లో తన విదేశీ పర్యటన ముగించుకుని ఆయన హైదరాబాదు రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.