: ఈ నెల 29 నుంచి తాత్కాలిక సచివాలయం నుంచే పాలన: చంద్రబాబు ప్రకటన


ఈ నెల 29 నుంచి ఏపీ పాలన నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి పరిధిలోని వెలగపూడిలో నిర్మితమవుతున్న తాత్కాలిక సచివాలయం నుంచే సాగుతుందట. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. శనివారం ఉదయం రాజధాని పరిధిలో పర్యటనకు వచ్చిన చంద్రబాబు సీడ్ కేపిటల్ రోడ్డుకు శంకుస్థాపన చేసి, వెలగపూడిలో ఎన్టీఆర్ అన్న క్యాంటీన్ ను ప్రారంభించారు. ఆ తర్వాత తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన అక్కడే మీడియాతో మాట్లాడారు. ఈ నెల 29 నుంచి తనతో పాటు తన కేబినెట్ మంత్రులంతా తాత్కాలిక సచివాలయం నుంచే విధులు నిర్వహిస్తారని ఆయన ప్రకటించారు. రోజుల వ్యవధిలోనే అన్ని భవన నిర్మాణాలు పూర్తవుతాయని చెప్పారు.

  • Loading...

More Telugu News