: శ్రీ‌వారి ఆల‌యంపై ప్ర‌భుత్వ పెత్త‌నం ఎందుకు..?: స్వ‌రూపానంద ఆగ్ర‌హం


కొత్త కొత్త జీవోలు తీసుకొచ్చి దేవాల‌య భూముల‌పై కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు పెత్తనం చలాయిస్తున్నాయని శార‌దా పీఠాధిప‌తి స్వామీ స్వ‌రూపానందేంద్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దేవాల‌యాల భూముల‌పై ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్య ధోర‌ణిని విడ‌నాడాల‌ని అన్నారు. శ్రీ‌వారి ఆల‌యంపై ప్ర‌భుత్వ పెత్త‌నం ఎందుక‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. దేవాల‌య భూముల‌ను ఇష్టారాజ్యంగా అమ్ముతున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. ప్రబుత్వ ఆగ‌డాల‌కు క‌ళ్లెంవేయాల్సిన అవసరం ఉందన్నారు. దేవాల‌య భూముల‌ను ర‌క్షించుకునే బాధ్య‌త త‌మ‌పై ఉంద‌ని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News