: త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఐదు రూపాయలకే భోజనం: చంద్రబాబు
పేదవాడికి సంక్షేమ కార్యక్రమాలు చాలా ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరు జిల్లా వెలగపూడిలో 'ఎన్టీఆర్ అన్న క్యాంటీన్'ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ...ఐదు రూపాయలకే భోజనం అందించే కార్యక్రమాన్ని త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించనున్నట్లు చెప్పారు. పేదవాడిని ఆదుకునేందుకు తాము అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. ఈరోజు ఏర్పాటు చేసిన క్యాంటీన్ ద్వారా రోజుకి మూడు వందల నుంచి నాలుగు వందల మందికి తక్కువ ధరకే భోజనం అందుతుందన్నారు. ఈ కార్యక్రమం అనంతరం ఆయన అక్కడి తాత్కాలిక సచివాలయ భవన నిర్మాణ పనులను పరిశీలించారు.