: ‘రూ.5 కే భోజనం’ రుచి చూసిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ నవ్యరాజధాని ప్రాంతం వెలగపూడిలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించారు. రూ.5 కే అల్పాహారం, భోజనం అందించే ప్రత్యేక కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. క్యాంటీన్‌ను ప్రారంభించిన అనంతరం చంద్రబాబు నాయుడు అక్కడి భోజనాన్ని స్వయంగా ప్రజలకు వడ్డించారు. తాను ప్రారంభించిన క్యాంటీన్‌లో తానే స్వయంగా భోజనం వడ్డించుకొని దానిని రుచి చూశారు. చంద్రబాబుతో పాటు హోం మంత్రి చినరాజప్ప, మంత్రులు నారాయణ, పరిటాల సునీత, ఎంపీ గల్లా జయదేవ్ సైతం అల్పాహారం రుచిచూశారు. ఆహార నాణ్యతను పరిశీలించారు. భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా ఈ క్యాంటీన్లను విస్తరించనున్నారు.