: సన్నీలియోన్ ‘బేబీ డాల్’ సాంగ్ కు ఢిల్లీ ఐఐటీ అమ్మాయిల డ్యాన్స్!... వైరల్ గా మారిన వీడియో!
ఆ అమ్మాయిలంతా ప్రతిష్ఠాత్మక ఢిల్లీ ఐఐటీకి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థినులు. స్టేజీ ఎక్కారు. సన్నీలియోన్ తనదైన స్టైల్లో స్టెప్పులేసి యువతను కిర్రెక్కించిన ‘బేబీ డాల్’ సాంగ్ మొదలైంది. ఇంకేముంది, ముందుగానే ప్రాక్టీస్ చేసినట్లు... ఒకరి తర్వాత ఒకరు ముందుకు వచ్చి స్టెప్పులేశారు. ఇవేవో మామూలు స్టెప్పులు కాదు. సన్నీలియోన్ కే దిమ్మ తిరిగే తరహా స్టెప్పులు. ఒకరి తర్వాత ఒకరుగా ఐదుగురు అమ్మాయిలు స్టేజీపై దుమ్ము రేపారు. ఆ తర్వాత ఐదుగురు కలిసి కొన్ని సెకన్ల పాటు అక్కడ కాలు కదిపారు. ఇటీవలే ఢిల్లీ ఐఐటీలో జరిగిన ఓ కార్యక్రమంలో భాగంగా ఆ అమ్మాయిలు ఈ డ్యాన్సులేశారు. ఈ సందర్భంగా అసభ్యకర నృత్య భంగిమలకు కూడా ఆ అమ్మాయిలు ఏమాత్రం వెనుకాడలేదు. 4.19 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.