: జ‌మ్మూకాశ్మీర్‌లో కొన‌సాగుతున్న ఉద్రిక్త‌త... రెచ్చిపోయిన వేర్పాటు వాదులు


జ‌మ్మూకాశ్మీర్‌లో మ‌రోసారి ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. వేర్పాటు వాదులు శనివారం రెచ్చిపోయారు. పాకిస్థాన్, ఐఎస్ఐఎస్ జెండాలు ప‌ట్టుకొని ర్యాలీ నిర్వ‌హించారు. ప‌లుచోట్ల ఆ జెండాలు ఎగుర‌వేసి అల‌జ‌డి సృష్టించారు. స‌మాచారాన్ని అందుకున్న పోలీసులు ప‌రిస్థితిని చక్క‌దిద్దేందుకు అక్క‌డ‌కు చేరుకున్నారు. అయితే వేర్పాటు వాదులు పోలీసుల‌పై దాడికి దిగారు. పోలీసుల‌పై రాళ్లు రువ్వుతూ రెచ్చిపోయారు. దీంతో మరిన్ని పోలీసు బలగాలను రంగంలోకి దింపి ప‌రిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

  • Loading...

More Telugu News