: చుక్కా రామయ్యకు అస్వస్థత!... నిమ్స్ లో చేరిన విద్యావేత్త!
తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ విద్యావేత్తగా ఎదిగిన మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య నిన్న రాత్రి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గ్రామీణ విద్యార్థులు కూడా జాతీయ స్థాయి ప్రవేశపరీక్షలో సత్తా చాటేందుకు ఐఐటీ ఫౌండేషన్ కోర్సుల పేరిట ప్రత్యేక కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేసిన రామయ్య ‘ఐఐటీ రామయ్య’గా అందరికీ చిరపరచితులే. నిన్న రాత్రి తీవ్రమైన నడుము నొప్పితో మెలికలు తిరిగిపోయిన ఆయనను కుటుంబ సభ్యులు నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలోని మిలీనియం బ్లాకులో ఆయనను అడ్మిట్ చేసుకున్న వైద్యులు ఆయనకు చికిత్స అందజేస్తున్నారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సమాచారం.