: చంద్రబాబు దత్తత గ్రామానికి రూ.1.90 కోట్లు!
స్మార్ట్ విలేజ్ కార్యక్రమంలో భాగంగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు విశాఖ జిల్లాలోని అరకు మండలం పెదబయలు పంచాయతీని దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ఈ గ్రామంలో అభివృద్ధి పనులు జోరందుకోనున్నాయి. ఈ మేరకు నిన్న గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఏపీ గిరిజన సంక్షేమ శాఖ రూ.1.90 కోట్లను విడుదల చేసింది. ఈ నిధుల్లో పెదబయలులో కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం రూ.25 లక్షలు, పంచాయతీ పరిధిలోని అరకు వ్యాలీలో మరో కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం మరో రూ.25 లక్షలు, అరకులో ఎడ్యుకేషన్ హబ్ కోసం రూ.1.40 కోట్లు కేటాయించనున్నారు. నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ చేయడంతో త్వరలోనే అక్కడ పనులు ఊపందుకోనున్నాయి.