: డ్రంకన్ డ్రైవ్ లో దొరికిపోయిన బుల్లితెర నటుడు భరణి శంకర్!... అరెస్ట్ చేసిన పోలీసులు
మద్యం సేవించి నిబంధనలకు విరుద్ధంగా కారు నడుపుతూ బుల్లితెర నటుడు భరణి శంకర్ అడ్డంగా దొరికిపోయాడు. నిన్న రాత్రి హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో ముమ్మరంగా డ్రంకన్ డ్రైవ్ సోదాలు జరగ్గా... పెద్ద సంఖ్యలో వాహనాలను ఆపిన పోలీసులు ఆయా వాహనాల డ్రైవింగ్ సీట్లలోని వ్యక్తులను పరీక్షించారు. ఈ సందర్భంగా భరణి శంకర్ కారును ఆపిన పోలీసులు డ్రైవింగ్ సీట్లోని అతడికి బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో అతడు 41 శాతానికి పైగా మద్యం సేవించినట్లు తేలింది. దీంతో అతడిపై కేసు నమోదు చేసిన పోలీసులు అతడి కారును స్వాధీనం చేసుకున్నారు. సోమవారం అతడిని కోర్టులో హాజరుపరచనున్నట్లు ఈ సందర్భంగా పోలీసులు చెప్పారు.