: సోనూసూద్ భార్య హ్యాండ్ బ్యాగ్ ను కొట్టేసిన దొంగ!
మాడ్రిడ్ ఎయిర్ పోర్టులో ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూసూద్ భార్య సోనాలి హ్యాండ్ బ్యాగ్ ను ఒక వ్యక్తి కొట్టేశాడు. ఐఫా పురస్కారాల కార్యక్రమంలో పాల్గొనేందుకు సోనూ సూద్ తన కుటుంబంతో కలిసి స్పెయిన్ వెళ్లారు. మాడ్రిడ్ విమానాశ్రయంలో దిగగానే సోనాలి హ్యాండ్ బ్యాగ్ ను లాక్కుని ఒక వ్యక్తి పారిపోయాడు. దీంతో, ఎయిర్ పోర్ట్ అధికారులకు సోనూసూద్ ఫిర్యాదు చేశాడు. ఆ బ్యాగ్ లో పాస్ పోర్ట్ తో పాటు ముఖ్యమైన కాగితాలు ఉన్నాయని అక్కడి భారత దౌత్యాధికారికి చెప్పారు.