: చిరంజీవిలా ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగిన నటుడు సునీల్: దర్శకుడు ఎన్.శంకర్


మెగాస్టార్ చిరంజీవిలా ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగిన నటుడు సునీల్ అని దర్శకుడు ఎన్.శంకర్ అన్నారు. ‘జక్కన్న’ ఆడియో రిలీజ్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ఒక కమెడియన్ స్థాయి నుంచి సునీల్ హీరోగా ఎదిగాడని, అది అంత చిన్న విషయం కాదని అన్నారు. ఈ సందర్భంగా ‘‘అమ్మలో మొదటి అక్షరం ‘అ’, ‘నాన్న’లో రెండో అక్షరం ‘న్న’ను కలిపితే ‘అన్న’ అంటూ పరుచూరి బ్రదర్స్ గతంలో రాసిన డైలాగును ఆయన గుర్తుచేసుకున్నారు. చిత్ర పరిశ్రమకు అలాంటి ‘అన్నయ్య’ చిరంజీవి అంటూ శంకర్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News