: సినిమా పైరసీని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటాం!: మంత్రి కేటీఆర్
సినిమా పైరసీని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ క్రైమ్ యూనిట్ (టీఐపీసీయూ) ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, సినిమా పైరసీ కారణంగా ప్రతి యేటా వెయ్యికోట్లకు పైగా నష్టపోతున్నామని తెలుసుకుని ఆశ్చర్యపోయానని అన్నారు. పైరసీ నియంత్రణలో బ్రిటన్ ప్రపంచంలోనే అత్యుత్తుమ విధానాన్ని అనుసరిస్తోందని, దీనిని స్ఫూర్తిగా తీసుకునే తెలంగాణలోనూ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ క్రైమ్ యూనిట్ ను ప్రారంభించాలని నిర్ణయించామన్నారు. కాగా, అమెరికాకు చెందిన ట్రేడ్ మార్క్స్ అండ్ పేటెంట్స్ ఆఫీసు సంస్థ సహకారంతో టీఐపీసీయూను ఏర్పాటు చేశారు. దీని ఏర్పాటులో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, తెలుగు చిత్ర పరిశ్రమ, మోషన్ పిక్చర్ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ కీలక పాత్ర పోషించాయి.