: కేంద్ర మంత్రి ఉమాభారతికి అస్వస్థత... ఎయిమ్స్ కు తరలింపు
కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఛాతి నొప్పి కారణంగా ఆమెను ఎయిమ్స్ కు తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తున్నట్లు కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి సమీర్ సిన్హా పేర్కొన్నారు. డాక్టర్ రాజేష్ మల్హోత్రా పర్యవేక్షణలోని వైద్యుల బృందం ఆమెకు వైద్య సేవలందిస్తోందని ఎయిమ్స్ సీనియర్ వైద్యులు తెలిపారు. మరోవైపు వీపు, మోకాలి నొప్పితో కూడా ఉమాభారతి బాధపడుతున్నారని చెప్పారు. కాగా, ఈరోజు సాయంత్రం 6 గంటల సమయంలో అక్బర్ రోడ్డులోని తన అధికారిక నివాసంలో ఉన్న ఉమాభారతికి ఛాతీ నొప్పి వచ్చినట్లు ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి.