: త్వరలో ఇంటింటికీ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తాం: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
త్వరలో ఇంటింటికీ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తామని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు.విజయవాడలో ఏపీ సీడ్కో ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, గోయల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోయల్ మాట్లాడుతూ, ఈ మీటర్ల ద్వారా విద్యుత్ చౌర్యం అదుపులోకి వస్తుందని, విద్యుత్ పంపిణీ, సరఫరా సక్రమంగా జరిగి, బిల్లింగ్ ఆదా అవుతుందని చెప్పారు. వచ్చే ఏడాదిలోగా రైతులకు 5 లక్షల వ్యవసాయ పంపుసెట్లు పంపిణీ చేస్తామని, వీటి పంపిణీకి అయ్యే ఖర్చును కేంద్రమే భరిస్తుందని అన్నారు. దేశంలో వందశాతం విద్యుత్ కనెక్షన్లు అందించిన మూడో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని, ఇప్పటివరకు గుజరాత్, పంజాబ్ మాత్రమే వందశాతం విద్యుద్దీకరణ సాధించాయని పీయూష్ గోయల్ అన్నారు.