: సెప్టెంబరులో మినీ ఐపీఎల్ కు బీసీసీఐ కసరత్తు


ఈ ఏడాది సెప్టెంబరులో మినీ ఐపీఎల్ నిర్వహించేందుకు బీసీసీఐ కసరత్తులు ప్రారంభించింది. మినీ ఐపీఎల్ ను రెండువారాల పాటు నిర్వహించనున్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. ఎనిమిది జట్లతో తక్కువ మ్యాచ్ లు ఉండేలా ఈ లీగ్ ను నిర్వహించాలనుకుంటున్నట్లు చెప్పారు. ఈ మినీ ఐపీఎల్ ను భారత్ లో కాకుండా విదేశాల్లో నిర్వహిస్తే ఎలా ఉంటుందనే విషయమై ఆలోచిస్తున్నట్లు అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News