: కూకట్పల్లిలో యువకుల స్ట్రీట్ఫైట్
హైదరాబాద్లో మరోసారి స్ట్రీట్ఫైట్ ఘటన చోటుచేసుకుంది. నగరంలోని కూకట్పల్లి ధర్మారెడ్డి కాలనీలో యువకులు ఒకరిపై ఒకరు పరస్పరం దాడికి దిగారు. స్ట్రీట్ఫైట్కు దిగిన వారంతా ధర్మారెడ్డి కాలనీలోని ఓ ప్రైవేటు హాస్టల్లో బస చేస్తోన్న వారుగా తెలుస్తోంది. హాస్టల్లో బసచేస్తోన్న సుమారు 60మంది యువకులు ఘర్షణకు దిగారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.