: ఆ ముగ్గురూ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఒత్తిడి ఎదుర్కొన్నా: టీమిండియా ప్రధాన కోచ్ కుంబ్లే


టీమిండియా ప్రధాన కోచ్ పదవి ఇంటర్వ్యూకు హాజరైన సమయంలో చాలా ఒత్తిడికి గురయ్యానని అనిల్ కుంబ్లే పేర్కొన్నాడు. ఈ ఇంటర్వ్యూకు హాజరవడం తనకు ప్రత్యేక అనుభవమన్నాడు. ‘ఒక జాబ్ కోసం ఇంటర్వ్యూకు వెళ్లడం నా జీవితంలో ఇదే మొదటిసారి. సచిన్ టెండూల్కర్, గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ లు సమకాలీన క్రికెటర్లు. వారితో కలిసి ఎన్నో మ్యాచ్ లు ఆడాను. అంతేకాకుండా, సాధారణంగా జరిగే జట్టు సమావేశాల్లో చాలాసార్లు పాల్గొన్నాను. అయితే, ప్రధాన కోచ్ పదవి ఇంటర్వ్యూకు హాజరైనప్పుడు మాత్రం కొంచెం ఒత్తిడికి గురయ్యాను. టేబుల్ కు ఒకవైపు గంగూలీ, లక్ష్మణ్ లు ఉండగా, మరోవైపు నేను కూర్చున్నాను. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సచిన్ కూడా ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ ముగ్గురూ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఒత్తిడికి గురయ్యాను. అయినప్పటికీ, టీమిండియా కోసం నా ప్రణాళిక గురించి స్పష్టంగానే వివరించాను’ అని కుంబ్లే పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News