: కేంద్రమంత్రి సంతోష్ గంగ్వార్ కారుపై రాళ్లదాడి.. స్వల్ప గాయాలు

ఒడిశాలోని బర్గాఢ్లో కేంద్రమంత్రి సంతోష్ గంగ్వార్ ప్రయాణిస్తున్న కారుపై రాళ్లదాడి జరిగింది. ఎన్డీఏ రెండేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని దేశవ్యాప్తంగా బీజేపీ బహిరంగ సభలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఈరోజు ఒడిశాలో నిర్వహించతలపెట్టిన సభలో పాల్గొనడానికి వస్తోన్న సంతోష్ గంగ్వార్ కారుపై బీజేడీ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. కేంద్రమంత్రి వెళ్లిపోవాలంటూ నినాదాలు చేశారు. కారుపై పలువురు రాళ్లు విసరడంతో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. కేంద్రమంత్రి రాకను అడ్డుకుంటామంటూ బీజేడీ కార్యకర్తలు నిన్న కూడా ర్యాలీ నిర్వహించారు.