: కాశ్మీర్ లో ‘పర్ఫెక్ట్ మార్నింగ్’ అంటున్న రాంచరణ్!
మెగా పవర్ స్టార్ రాంచరణ్ తాజా చిత్రం ‘ధ్రువ’ షూటింగ్ ప్రస్తుతం కాశ్మీర్ లో జరుగుతోంది. అక్కడి ప్రకృతి అందాలను చూసి పరవశిస్తున్న రాంచరణ్ ఒక సెల్ఫీ దిగి తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశాడు. దీనికి ‘పర్ఫెక్ట్ మార్నింగ్’ అనే క్యాప్షన్ ను కూడా పెట్టాడు. కాగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాంచరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. ‘తని ఒరువన్’ అనే తమిళ చిత్రానికి రీమేక్ గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.