: టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే!: కేంద్ర మంత్రి జేపీ నడ్డా
తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని కేంద్రమంత్రి జేపీ నడ్డా అన్నారు. ఖమ్మం జిల్లాలో ఈరోజు నిర్వహించిన బీజేపీ వికాస్‌పర్వ్ సభలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీ పుంజుకుంటుందని చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని ఆయన అన్నారు. ఇప్పటికే తెలంగాణలో రూ.43వేల కోట్లతో జాతీయ రహదారులు అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. రెండేళ్ల పాలనలో మోదీ అవినీతిని అరికట్టారని ఆయన అన్నారు. అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా బీజేపీ పాలన సాగుతోందని, తదుపరి ఎన్నికల్లో తెలంగాణలోనూ బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంటుందని ఆయన వ్యాఖ్యానించారు.