: రాజధాని నిర్మాణానికి స్విస్ ఛాలెంజ్ పధ్ధతికి కేబినెట్ ఆమోదం: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, సంక్షోభాలను అవకాశాలుగా మార్చుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలో కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కట్టుబట్టలతో హైదరాబాద్‌కు వచ్చామని అమరావతిని అభివృద్ధి చేసుకుందామని అన్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన ప్రాంతాన్ని రాజధానిగా నిర్ణయించామని, రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి 33వేల ఎకరాల భూములిచ్చారని ఆయన అన్నారు. రాజధాని నిర్మాణానికి 'స్విస్ ఛాలెంజ్' పద్ధతికి కేబినెట్ భేటీలో ఆమోదం తెలిపామని చంద్రబాబు తెలిపారు. సింగపూర్ ప్రభుత్వ సంస్థలు అసెండా సింగ్‌బ్రిడ్జి, సెమ్‌కార్ట్.. స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో ముందుకొచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. అమరావతి డెవలప్ మెంట్ కంపెనీ, రెండు సింగపూర్ కంపెనీలు కన్సార్టియంతో వెళ్లనున్నట్లు ఆయన వెల్లడించారు.