: పేద ప్రజలను వెన్నుపోటు పొడిచిన టీఆర్ఎస్ ప్రభుత్వం: మల్లు రవి
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పక్కన పెట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజలను వెన్నుపోటు పొడిచిందని కాంగ్రెస్ నేత మల్లు రవి విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, విద్యుత్, ఆర్టీసీ ఛార్జీల పెంపును తీవ్రంగా ఖండిస్తున్నామని, కాంట్రాక్టర్లకు, ధనవంతులకు, వ్యాపారులకు ప్రభుత్వం అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ మండిపడ్డారు. ప్రాధాన్యతలేని పనులకు వందల కోట్లు ఖర్చు పెడుతున్నారని విమర్శించారు. పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గించాలని, లేకుంటే తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ ల ఎదుట ధర్నాలు, నిరసనలు చేపట్టనున్నట్లు మల్లు రవి చెప్పారు.