: నాకు సంబంధం లేని విషయంపై నన్ను విమర్శిస్తారా..?: బాలీవుడ్ భామ అనుష్కశర్మ
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ కథానాయిక అనుష్క శర్మ మధ్య ఉన్న సంబంధంపై సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేసిన విషయం తెలిసిందే. కొన్ని నెలల క్రితం కోహ్లీ మెరుగైన ఆటతీరు కనిపించక పోవడంతో దానికి అనుష్కనే కారణం అంటూ సోషల్ మీడియాలో ఆమెపై నెటిజన్లు పలు విమర్శలు చేశారు. దీనిపై తాజాగా అనుష్క స్పందిస్తూ.. సోషల్ మీడియాలో తనపై విమర్శలు గుప్పిస్తోన్న వారంతా స్త్రీ ద్వేషులు అని అభివర్ణించింది. 'ఎవరిపైన ఆధారపడకుండా, సక్సెస్ ఫుల్‌గా బాధ్యతలు నిర్వహిస్తోన్న మహిళలను చూస్తే నెటిజన్ల ఈగో హర్ట్ అవుతుంది' అని ఆమె పేర్కొంది. నెటిజన్లు తనకు సంబంధంలేని విషయంపై తనపై కామెంట్లు చేస్తూ, విమర్శలు గుప్పించడమేంటని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.