: తెలంగాణ సర్కార్ పెంచిన ఛార్జీలకు నిరసనగా రేపు ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద ధర్నా


తెలంగాణ సర్కార్ విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలను పెంచుతూ నిన్న నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. సామాన్యుడిపై మోపుతోన్న అధిక ఛార్జీల భారాన్ని నిరసిస్తూ రేపు ఉద‌యం వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ వ‌ద్ద ధ‌ర్నా నిర్వ‌హించ‌నున్నారు. ఈ విష‌యాన్ని వైఎస్ఆర్ సీపీ తెలంగాణ‌ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి ఈరోజు మీడియాకు తెలిపారు. సామాన్యుడిపై భారం ప‌డ‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల్సిన ప్ర‌భుత్వం వారిపైనే భారాన్ని మోపడం ఏంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. తెలంగాణ ప్ర‌భుత్వం రెండేళ్ల ఉత్స‌వాల పేరిట రూ.300 కోట్ల ప్ర‌జాధ‌నాన్ని ప్ర‌చారానికి ఖ‌ర్చు చేసింద‌ని ఆయ‌న ఆరోపించారు.

  • Loading...

More Telugu News