: లోటస్ పాండ్ కు వచ్చిన బ్రిటీష్ హైకమిషనర్
ఇండియాలో బ్రిటీష్ హై కమిషనర్ డోమినిక్ అస్క్విత్ వైకాపా నేతలను కలుసుకున్నారు. హైదరాబాద్ లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం ఉన్న లోటస్ పాండ్ కు వచ్చిన ఆయన పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆయనకు స్వాగతం పలికారు. ఆపై కాసేపు వారితో అస్క్విత్ సమావేశమయ్యారు. కాగా, పార్టీ అధినేత వైఎస్ జగన్ విదేశీ పర్యటనలో ఉన్న కారణంగా బ్రిటీష్ హై కమిషనర్ ను ఆయన కలవలేక పోయారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.