: శ్రీకాళహస్తీశ్వరాలయంలో తుపాకీతో బెదిరిస్తూ గుర్తుతెలియని వ్యక్తి హల్‌చల్
చిత్తూరులోని శ్రీకాళహస్తీశ్వర ఆలయం వద్ద ఓ గుర్తుతెలియని వ్యక్తి అలజడి సృష్టించాడు. తుపాకీని చేతిలో పట్టుకుని స్థానికులను భయాందోళనలకు గురి చేశాడు. ఆలయ పీఆర్వో కార్యాలయంలో ఓ ఉద్యోగికి తనతో తెచ్చుకున్న తుపాకీని చూపిస్తూ తనకు గది ఇవ్వాలని బెదిరించాడు. గుర్తు తెలియని వ్యక్తి తుపాకీతో తిరుగుతున్నాడని స్థానికులు పోలీసులకి సమాచారం అందించారు. అయితే, పోలీసులు ఆలయం వద్దకు చేరుకునే సమయానికి దుండగుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో నిందితుడి కోసం గాలింపు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.