: ఫీ'జులుం'కు వ్యతిరేకంగా ఏపీ సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి యత్నం.. ఉద్రిక్తత
కార్పోరేట్ విద్యా సంస్థల్లో వసూలు చేస్తోన్న అధిక ఫీజులను నియంత్రించాలని, సంక్షేమ హాస్టళ్ల మూసివేతను ఆపేయాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్‌యూ కార్యకర్తలు ఈరోజు విజయవాడలోని ఏపీ ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ ముట్టడికి యత్నించారు. ఈరోజు ఉదయం అక్కడకు చేరుకున్న కార్యకర్తలు ఫీ'జులుం'కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో పీడీఎస్‌యూ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య పరస్పరం తోపులాట జరిగింది. పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.