: పోలీస్ కస్టడీకి బురిడీ బాబా!... కుట్ర కోణాన్ని నిగ్గు తేల్చనున్న టీ పోలీస్!
హైదరాబాదు ప్రముఖ రియల్టర్, లైఫ్ స్టైల్ బిల్డింగ్ యాజమాని మధుసూదనరెడ్డి కుటుంబాన్ని మాయ చేసి రూ.1.33 కోట్లతో ఉడాయించిన బురిడీ బాబాను తెలంగాణ పోలీసులు 24 గంటలు తిరక్కుండానే అరెస్ట్ చేశారు. కోర్టు ఆదేశాల మేరకు అతడిని జ్యూడిషియల్ రిమాండ్ కు తరలించిన పోలీసులు ఈ కుట్ర కోణాన్ని ఛేదించేందుకు శివానందను తమ కస్టడీకి తీసుకోవాల్సిందేనని భావించారు. ఈ మేరకు పోలీసుల పిటిషన్ ను నేటి ఉదయం విచారించిన నాంపల్లి మెట్రోపాలిటన్ కోర్టు... శివానందను ఐదు రోజుల కస్టడీకి అనుమతించింది. దీంతో శివానందను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ కోసం అతడిని తీసుకెళ్లారు. ఈ కేసులో మధుసూదన్ రెడ్డి స్నేహితుడు, ఆయనకు శివానందను పరిచయం చేసిన మోహన్ రెడ్డిని పోలీసులు కీలక నిందితుడిగా అనుమానిస్తున్నారు. ఈ ఐదు రోజుల విచారణలో భాగంగా ఈ కేసు వెనక ఉన్న తతంగాన్ని మొత్తం బయటకు వెలికితీయనున్నారు.