: తక్కువగా మాట్లాడడమే మంచిది, నేనిక అదే ఫాలో అవుతా: సల్మాన్ ఖాన్


తాను సుల్తాన్ సినిమా షూటింగ్ లో కుస్తీ ఫీట్లు చేసినప్పుడు నీర‌సించిపోయేవాడినని, షూటింగ్ తరువాత అత్యాచారానికి గురైన మహిళ పరిస్థితిని అనుభవించానని బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇటీవ‌ల వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. జాతీయ మహిళా కమిషన్ కూడా స‌ల్మాన్ ఖాన్ వ్యాఖ్య‌ల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఈ అంశంపై తాజాగా ముంబ‌యిలో స‌ల్మాన్ ఖాన్ స్పందిస్తూ.. తానిక‌పై త‌క్కువ‌గా మాట్లాడ‌తాన‌ని చెప్పాడు. తాను చేసిన వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుగా అర్థం చేసుకున్నార‌ని, తక్కువ‌గా మాట్లాడ‌డ‌మే మంచిద‌ని, తానిక అదే ఫాలో అవుతానని స‌ల్మాన్ వ్యాఖ్యానించాడు. తన వ్యాఖ్య‌ల ప‌ట్ల‌ దేశ‌వ్యాప్తంగా నిర‌స‌న‌లు వ‌స్తుండ‌డంతో సల్మాన్ ఈ నిర్ణ‌యం తీసుకున్నాడు.

  • Loading...

More Telugu News