: మంత్రులు టై, కోట్ ధరిస్తే వెయిటర‍్లలా కనిపిస్తారు: సుబ్రహ్మణ్య స్వామి
వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి తాజాగా విదేశీ పర్యటనలో మన మంత్రులు వేసుకునే దుస్తులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే ఆయన ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్‌పై వరసగా విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తన రూటు మార్చి ఈసారి మంత్రుల దుస్తులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంత్రులు విదేశీ పర్యటనలో టై, కోట్ ధరించవద్దని భారతీయ సంప్రదాయాన్ని చాటే దుస్తులు మాత్రమే ధరించాలని ఆయన ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. బీజేపీ ఈ అంశంపై చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. మంత్రులు మన సంప్రదాయ దుస్తుల్లో కాకుండా విదేశీ దుస్తుల్లో కనిపిస్తే వారు వెయిటర్లలా ఉంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు.