: అఖిలేశ్ కు ఎన్ఎస్జీ సెక్యూరిటీ ఉపసంహరణ?... లాలూ, కరుణానిధికి కూడానట!


ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ కు కొనసాగుతున్న నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్ఎస్జీ) భద్రత ఉపసంహరణకు సమయం ఆసన్నమైంది. జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కలిగి ఉన్న అఖిలేశ్ కు ఎన్ఎస్జీ కమెండోలు గార్డులుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే దేశంలోని ప్రముఖులకు కల్పిస్తున్న భద్రతపై ఇటీవల కేంద్ర హోం శాఖ సమీక్షించింది. కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్ మెహరిషి ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో అఖిలేశ్ కు ఎన్ఎస్జీ గార్డులతో భద్రత కల్పించాల్సిన అవసరం లేదని అధికారులు అభిప్రాయపడ్డారు. అఖిలేశ్ తో పాటు బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిలకు కూడా ఈ భద్రత అవసరం లేదని ఆ భేటీ అభిప్రాయపడింది. ఇదే అభిప్రాయంతో కూడిన నివేదికను ఆ సమావేశం కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అనుమతి కోసం పంపింది. దీనిపై రాజ్ నాథ్ సంతకం చేస్తే ఈ ముగ్గురికి ఎన్ఎస్జీ కమెండోల భద్రత ఉపసంహరిస్తారు. ఎన్ఎస్జీ కమెండోల స్థానంలో వారికి పారా మిలిటరీ బలగాలతో భద్రత కల్పిస్తారు.

  • Loading...

More Telugu News