: రిలయన్స్ బంపరాఫర్.. 93 రూపాయలకే 10 జీబీ డాటాతో 4జీ సేవలు


రిలయన్స్ కమ్యూనికేషన్ తన వినియోగదారులకు బంపరాఫర్ ప్రకటించింది. రిలయన్స్ సీడీఎంఏ ఫోన్ల వినియోగదారులకు 93 రూపాయలకే 10 గిగాబైట్స్(జీబీ)తో 4జీ సేవలను అందించాలని నిర్ణయించింది. వచ్చే వారం నుంచి ఈ సేవలు ఎంపిక చేసిన నగరాల్లో అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. ఈ మేరకు టెలికం డిపార్ట్‌మెంట్‌కు లేఖ రాసింది. జియో నెట్‌వర్క్ ద్వారా ఈ సేవలు అందించనున్నామని, సీడీఎంఏ వినియోగదారులకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది. 80 లక్షల మంది రియలన్స్ వినియోగదారుల్లో 90శాతం మంది 4జీకి మారినట్టు కంపెనీ పేర్కొంది. రూ.93కే 10జీబీ 4జీ డాటాను అందించనున్నామని, ఇతర నెట్‌వర్క్‌లతో పోలిస్తే 94శాతం తక్కువ ధరకు ఈ సేవలను ఆఫర్ చేస్తున్నట్టు తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. ముంబై, కోల్‌కతా, నగరాలతో పాటు గుజరాత్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, మధ్య ప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో వచ్చేవారం నుంచి రూ.93 నుంచి రూ.97తో ఈ సేవలు లభిస్తాయని తెలిపింది.

  • Loading...

More Telugu News