: చంద్రబాబే స్ఫూర్తిగా సైకిలెక్కిన మహిళా ఏసీటీఓ!... హైదరాబాదు నుంచి అమరావతికి పయనం!
నవ్యాంద్ర నూతన రాజధానిలో దాదాపుగా సిద్ధమైన తాత్కాలిక సచివాలయానికి ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగులు పయనమయ్యారు. ఇప్పటికే చాలా శాఖలకు చెందిన ఉద్యోగులు అమరావతి తరలివెళ్లారు. ముందుగా అనుకున్న మేరకే ఈ నెల 27 నాటికి ఉద్యోగుల తరలింపును పూర్తి చేయాలన్న ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సంకల్పానికి వాణిజ్యపన్నుల శాఖకు చెందిన ఓ మహిళా అధికారి మద్దతు పలికారు. చంద్రబాబు సంకల్పమే స్ఫూర్తిగా వాణిజ్యపన్నుల శాఖలో అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ (ఏసీటీఓ)గా పనిచేస్తున్న పద్మ... నేటి ఉదయం సైకిల్ పై హైదరాబాదు నుంచి అమరావతికి బయలుదేరారు. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు నాంపల్లిలోని వాణిజ్య పన్నుల శాఖ వద్ద జెండా ఊపి ఆమె సైకిల్ యాత్రను ప్రారంభించారు. సైక్లింగ్ లో కాస్తంత అనుభవం ఉన్న తాను ఈ నెల 27లోగా అమరావతి చేరుకుంటానని పద్మ చెప్పారు.