: టాయిలెట్లు లేకున్నా పర్వాలేదు.. మొబైల్ ఫోన్ మాత్రం తప్పనిసరట!


ప్రజలకు ముఖ్యమైనవి ఏవి? టాయిలెట్లా.. మొబైల్ ఫోన్లా? అంటే ఫోన్లే అంటున్నారు గుజరాత్ ప్రజలు. రాష్ట్రంలో మరుగుదొడ్ల కంటే మొబైల్ ఫోన్లు కలిగిన ఇళ్లే ఎక్కువ ఉన్నట్టు తాజా సర్వే ఒకటి వెల్లడించింది. శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టం-బేస్‌లైన్ సర్వే(ఎస్ఆర్ఎస్) ప్రకారం రాష్ట్రంలో 98.3శాతం మంది మొబైల్ ఫోన్లు కలిగి ఉండగా 69.8 శాతం ఇళ్లలోనే టాయిలెట్లు ఉన్నాయి. మరోవైపు ప్రభుత్వ అధికారులు మాత్రం 73.98 శాతం ఇళ్లలో మరుగుదొడ్లు ఉన్నట్టు చెబుతున్నారు. ఎస్ఆర్ఎస్ సర్వే పేర్కొన్న 69.8శాతం టాయిలెట్లలో 61.3శాతం మరుగుదొడ్లకు నీటి సౌకర్యం ఉంది. 5శాతానికి నీటి సౌకర్యం లేదు. మిగతా 2.5 శాతం మంది కమ్యూనిటీ టాయిలెట్లు వినియోగించుకుంటున్నారు. కాగా రాష్ట్రంలో 6.04కోట్ల మంది ప్రజలు ఉండగా 6.18 కోట్ల మొబైల్ కనెక్షన్లు ఉన్నట్టు ఈ ఏడాది ఏప్రిల్‌లో టెలికం రెగ్యులేటర్ అథారిటీ(ట్రాయ్) ప్రకటించడం విశేషం.

  • Loading...

More Telugu News