: బ్లాక్ ఫ్రైడే... 750 పాయింట్ల భారీ నష్టంలో సెన్సెక్స్!
బ్రెగ్జిట్ ఫలితం భారత స్టాక్ మార్కెట్ కు 'బ్లాక్ ఫ్రైడే'ను మిగిల్చేలా ఉంది. ఐరోపా దేశాల కూటమి నుంచి బ్రిటన్ వైదొలగాలంటూ ప్రజలు తీర్పిస్తున్నారని వచ్చిన వార్తలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ పూర్తిగా హరించుకుపోయింది. ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడి వెల్లువెత్తడంతో ప్రీమార్కెట్ సెషన్లో 400 పాయింట్లు పడిపోయిన బెంచ్ మార్క్ సూచిక సెన్సెక్స్, ఆపై సెషన్ ఆరంభంలోనే 750 పాయింట్లకు పైగా పడిపోయింది. ఆపై 9:35 గంటల సమయంలో క్రితం ముగింపుతో పోలిస్తే, బీఎస్ఈ సెన్సెక్స్ 692 పాయింట్ల నష్టంతో 26,309 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 220 పాయింట్ల నష్టంతో 8,049 పాయింట్ల వద్దా కొనసాగుతున్నాయి. నిఫ్టీ-50లో సన్ ఫార్మా మినహా మిగతా అన్ని కంపెనీలూ నష్టాల్లోనే ఉన్నాయి. అత్యధికంగా టాటా గ్రూప్ కంపెనీల ఈక్విటీ విలువ దిగజారింది.