: రాబర్ట్ వాద్రాపై క్రిమినల్ కేసులు నమోదు చేయండి: రాజస్థాన్ ప్రభుత్వానికి బీజేపీ ఎంపీ లేఖ


కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని బీజేపీ ఎంపీ కిరిట్ సోమైయ రాజస్థాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు డీజీపీ, బికనీర్ కలెక్టర్, ఎస్పీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌కు లేఖలు రాశారు. బికనీర్‌లో రైతుల పునరావాసం కోసం కేటాయించిన భూములను వాద్రా కంపెనీ, ఏజెంట్లు ఫోర్జరీ డాక్యుమెంట్లతో సొంతం చేసుకున్నారని, ఆ తర్వాత వాటిని ఇతరులకు విక్రయించారని అందులో పేర్కొన్నారు. రైతుల భూములను అక్రమంగా సొంతం చేసుకున్న వాద్రా కంపెనీలతోపాటు ఏజెంట్లపైనా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కిరిట్ డిమాండ్ చేశారు. అయితే, తనపై వస్తున్న ఆరోపణలను వాద్రా కొట్టిపడేశారు. కాగా ఈ విషయంలో కలెక్టర్ ఆధ్వర్యంలో దర్యాప్తు జరుగుతోందని, ఎవరినీ వదిలిపెట్టేది లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ పర్నామీ తెలిపారు.

  • Loading...

More Telugu News