: అది జగన్ కోరిక మాత్రమే!... ‘కుంగిన నేల’పై నారాయణ సెటైర్లు!


నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో మూడు అడుగుల మేర భూమి కుంగిందన్న వార్తలు ఏపీ మునిసిపల్ శాఖ మంత్రి, రాజధాని నిర్మాణ బాధ్యతలను భుజాన వేసుకున్న పొంగూరు నారాయణను తీవ్ర ఆగ్రహావేశాలకు గురి చేశాయి. నిన్న సాయంత్రం ఈ వార్తలు వెలువడగానే నేరుగా వెలగపూడిలో శరవేగంగా కొనసాగుతున్న తాత్కాలిక సచివాలయం వద్దకు ఆయన పయనమయ్యారు. అప్పటికే మీడియా ప్రతినిధులకు సమాచారం అందించిన ఆయన సదరు వార్తలపై ధ్వజమెత్తారు. ‘భూమి ఎక్కడ కుంగిందో చూపండి’ అంటూ ఆయన మీడియా ప్రతినిధులను నిలదీశారు. వెలగపూడికి బయలుదేరే ముందే ఆయన విజయవాడలో దీనిపై నిన్న సాయంత్రం ఓ పత్రికా ప్రకటనను విడుదల చేశారు. ఆ ప్రకటనలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన కుటుంబం ఆధ్వర్యంలోని మీడియా సంస్థలపై నారాయణ సెటైర్లు సంధించారు. ‘‘అమరావతిలో భూమి కుంగిపోవాలన్నది జగన్ కోరిక మాత్రమే. జగన్ కోరికనే ఆయన మీడియా సంస్థలు ప్రసారం చేశాయి. వాస్తవానికి అక్కడ భూమి కుంగిపోలేదు’’ అని నారాయణ ఆ ప్రకటనలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News