: బ్రెగ్జిట్‌కు వ్యతిరేకంగా ఓటేసిన భారత సంతతి ఓటర్లు!


యూరోపియన్ యూనియన్‌లో బ్రిటన్ కొనసాగాలా? వద్దా? అనే అంశంపై గురువారం నిర్వహించిన రెఫరెండంలో భారతీయ సంతతి ఓటర్లు అధిక సంఖ్యలో పాల్గొని ఓట్లేశారు. దేశంలో ఉన్న 1.2 మిలియన్ల భారత సంతతి ఓటర్లలో అధిక శాతం బ్రెగ్జిట్‌కు వ్యతిరేకంగా ఓటేసినట్టు తెలుస్తోంది. యూకే భవిష్యత్తును నిర్ణయించే ఈ రెఫరెండంపై ఇటీవల నిర్వహించిన సర్వే విషయాలను బ్రిటిష్ ఎలక్షన్ స్టడీ వెల్లడించింది. దాని ప్రకారం 51.7 శాతం భారత సంతతి ఓటర్లు బ్రెగ్జిట్‌కు వ్యతిరేకం కాగా 27.74శాతం అనుకూలంగా ఉన్నారు. మరో 16.85 శాతం మంది తాము దేనిలో ఉండాలో తేల్చుకోలేకపోతున్నారు. కాగా బ్రెగ్జిట్‌పై భారత సంతతి రాజకీయ నాయకులు రెండుగా చీలిపోయారు. యూకే ఉపాధి మంత్రి ప్రీతి పటేల్, ఇన్ఫోసిస్ చీఫ్ నారాయణ మూర్తి అల్లుడు రిషి సునక్ తదితరులు బ్రెగ్జిట్‌కు అనుకూలం కాగా కీత్ వాజ్, వీరేంద్ర శర్మ లాంటి సీనియర్ ఎంపీలు బ్రిటన్ యూరోపియన్ యూనియన్‌లోనే కొనసాగడం ఉత్తమమని తేల్చి చెప్పారు.

  • Loading...

More Telugu News