: ఒక్క ఆర్డర్‌తో 43 కేసులను కొట్టేసిన చెన్నై కుటుంబ న్యాయస్థానం
చాలా ఏళ్లుగా కోర్టులో నలుగుతూ వస్తున్న 43 కేసులను మొదటి అదనపు కుటుంబ న్యాయస్థానం ఒకే ఒక్క ఆర్డర్‌తో కొట్టేసింది. ఇలా ఒక్క ఆర్డర్‌తో ఇన్ని కేసులను కొట్టేయడం అరుదనే చెప్పాలి. సంవత్సరాల తరబడి కోర్టులో నడుస్తున్న విడాకుల కేసులను కోర్టు బయట పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్న పిటిషన్‌దారులు ఆమేరకు రాజీ మెమోలను కోర్టుకు సమర్పించారు. తాము రాజీకొచ్చామని కేసును కొట్టివేయాలని అందులో పేర్కొన్నారు. అయితే ఆ రాజీ మెమోలు చట్టప్రకారం లేకపోవడంతో ఇతర ఆలోచన లేకుండా ఒకే ఒక్క కామన్ ఆర్డర్‌తో కోర్టు వాటిని కొట్టివేసింది. ఇలా జరగడం చాలా అరుదని, అయితే జడ్జి చేసింది సాంకేతికంగా, చట్టప్రకారం సరి అయినదేనని ఓ న్యాయవాది పేర్కొన్నారు. జడ్జి కొట్టివేసిన కేసులలో ఏడేళ్ల నుంచి నడుస్తున్నవి కూడా ఉన్నాయి.